Bimbisara Movie Rating

2022 - 8 - 5

Post cover
Image courtesy of "TV9 Telugu"

Bimbisara Review: 'బింబిసార' మూవీ రివ్యూ.. ఇంట్రెస్టింగ్ సోషియో ... (TV9 Telugu)

Bimbisara Movie Review: బింబిసార గురించి చాలా రోజులుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంది.

Channel No. 176 Channel No. 1667 Channel No. 722 Channel No. 905 Channel No. 1459

Post cover
Image courtesy of "Greatandhra Telugu"

Bimbisara Review: మూవీ రివ్యూ: బింబిసార (Greatandhra Telugu)

టైటిల్: బింబిసార రేటింగ్: 2.5/5 తారాగణం: నందమూరి కళ్యాణ్‌ రామ్‌, కేథ‌రిన్ థ్రెసా, ...

ప్రధమార్థంలో చాలా సేపటి వరకు తెర మీద సన్నివేశాలు మారుతుంటాయి తప్ప ఎమోషన్ అందదు. నెమ్మదిగా కథ అందుకుని ఇంటర్వల్ బ్యాంగ్ కి వచ్చేసరికి ఎమోషనల్ గా మారుతుంది. సెకండాఫ్ కూడా మరీ ప్రెడిక్టబుల్ గా కాకుండా ప్యారలెల్ వర్డ్ల్స్ టైప్ లో ప్యారలల్ టైం లో జరిగే సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి. అయితే వీటికీ ఈ మధ్యన వచ్చిన "ప్లే బ్యాక్" కి కొంచెం పోలికలు కనిపిస్తాయి. పాటలు మాత్రం పెద్ద గుర్తుండేలా, హం చేసుకునేలా లేవు. అయితే "ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడి.." అనే పాట మాత్రం సందర్భోచితంగా చూస్తున్నప్పుడు ఆకట్టుకుంది. ఆ పాటకి చేసిన ఎడిటింగ్ కూడా బాగుంది. "గులేబకావళి అందం.." మాత్రం పాత తరహా ఆర్కెస్ట్రాలా వినిపిస్తుంది. కళ్యాణ్ రామ్ కష్టాన్ని మెచ్చుకోవచ్చు. ద్విపాత్రాభినయంలో చక్కని వైవిధ్యం కూడా చూపించాడు. కానీ అక్కడక్కడ అవసరానికి మించి అరిచినట్టు లౌడ్ గా అనిపించింది. క్యాథరీన్ మాత్రం లావుగా ఉన్నా ఆ పాత్ర వరకు సరిపోయింది. అయ్యప్ప శర్మ ఓకే. మిగిలిన వాళ్లంతా తమతమ పాత్రల్లో మమ అనిపించారు తప్ప ప్రత్యేకమైన మెరుపులు మెరిపించలేదు. దర్శకత్వపరంగా ప్రస్తుత స్టాండర్డ్స్ ని దృష్టిలో పెట్టుకుంటే యావరేజని చెప్పాలి. ఇలాంటి సినిమాలకు పని చేసేటప్పుడు ఇంకా సాన పెట్టాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ నిరుత్సాహపరచకుండా తీసిన సినిమా ఇది. సంగీతం (పాటలు): చిరంతన్ భట్, వరికుప్పల యాదగిరి, కీరవాణి అలాగే "యమగోల", "యమలీల" సినిమాల్లో యముడు, చిత్రగుప్తుడు భూలోకానికి వచ్చినట్టు ఇందులో కూడా అలాంటి సీన్స్ రిపీటైనట్టు అనిపించాయి. సంగీతం (బ్యాక్ గ్రౌండ్): ఎం.ఎం. కీరవాణి సాంకేతికంగా ఉన్నంతలో బాగానే తెరకెక్కించారు. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ చీప్ గా అనిపించినా చాలా చోట్ల బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. అన్నట్టు ఒకానొక చోట ధన్వంతరిపురం అనే ఊరి ఎపిసోడ్ వస్తుంది. అదేంటో గానీ ఒక్క క్షణం "ఆచార్య"లోని పాదఘట్టం గుర్తొచ్చి కంగారుపెట్టింది. కానీ అంతలోనే సర్దుకుని కథ ఆ దిశగా వెళ్లకుండా ట్రాకు మారింది. ఉన్నపళంగా ఒకానొక కాలానికి చెందిన వ్యక్తి వేరే కాలంలోకి వెళ్లడమనే కాన్సెప్ట్ ఈ మాధ్య జెర్మన్ వెబ్ సిరీస్ "డార్క్" లో పాపులరయింది. మనుసులు ఒక సొరంగం ద్వారా వేరు వేరు కాలాల్లోకి వెళ్లిపోతుంతారు ఈ సిరీస్ లో. ఇలాంటి ఐడియాతో నైజీరియన్ చిత్రం "డే ఆఫ్ డెస్టినీ" వచ్చింది. అందులో ఒక మెజీషియన్ ద్వారా పాత్రలు ఒక కాలంలోంచి ఇంకో కాలనికి వెళ్తారు. అలాగే ఇందులో మాయాదర్పణం ద్వారా కాలాల మధ్య ప్రయాణం చేస్తుంటుంది ప్రధానపాత్ర. రాజులకాలం, ప్రస్తుతకాలం మధ్యన కథనగానే "మగధీర" గుర్తొస్తుంది. అందులో రావురమేష్ పాత్రలాగ ఇందులో అయ్యప్పశర్మ పాత్రుంది. అక్కడ విలన్ లాగానే ఇక్కడా ప్రస్తుత కాలంలో విలనుంటాడు. అయితే మగధీర పునర్జన్మల కాన్సెప్ట్. ఇది అలా కాదు. టైటిల్ చూసి ఇది ఆ చారిత్రాత్మక చిత్రమేమో అనుకుంటే పొరపాటే. దానికి, ఈ సినిమాకి ఏ సంబంధమూ లేదు. సౌండింగ్ బాగుందనో, హిస్టారికల్ పేరైతే క్యాచీగా ఉంటుందనో ఈ టైటిల్ పెట్టారు తప్ప ఇంకేం కాదు. సింపుల్ గా చెప్పాలంటే రాజమౌళి తీసిన ఆర్.ఆర్.ఆర్ కి అల్లూరి సీతారామరాజుకి, కొమురం భీం కి ఎంత సంబంధముందో ఇదీ అంతే. బింబిసారుడనగానే క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నాటి మగథసామ్రాజ్యాధినేత గుర్తొస్తాడు. హిందీలో వైజయంతిమాల నటించిన "ఆమ్రపాలి"లో సునీల్ దత్ పోషించింది అజాతశత్రు పాత్ర. ఆ అజాతశత్రు తండ్రే బింబిసారుడు. అది చరిత్ర.

Post cover
Image courtesy of "ఈనాడు"

Bimbisara review: రివ్యూ: బింబిసార (ఈనాడు)

Bimbisara movie review: కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటించిన 'బింబిసార' ఎలా ఉందంటే?

- Politics News - Politics News - Movies News - Politics News - Movies News - Sports News - Bimbisara review: రివ్యూ: బింబిసార - Sita Ramam Review: రివ్యూ: సీతారామం Telugu News - ప్రధమార్ధం - నెమ్మదిగా సాగే కథనం

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Bimbisara Movie Review : బింబిసార మూవీ రివ్యూ.. ఆసక్తి రేకిత్తించే ... (News18 తెలుగు)

నందమూరి కళ్యాణ్ రామ్ , కేథరిన్, సంయుక్తా మీనన్, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, తదితరులు..

: : : : : : : : : : నిర్మాత : హరికృష్ణ

Post cover
Image courtesy of "సాక్షి"

పసి పిల్లలను సైతం చంపే రాక్షస చక్రవర్తి 'బింబిసార'.. మూవీ రివ్యూ (సాక్షి)

నటీనటులు: కల్యాణ్ రామ్‌, కేథరీన్‌ థ్రేసా, సంయుక్త మీనన్‌, ప్రకాశ్‌ రాజ్‌, వివాన్‌ భటేనా, ...

ఈ సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ చిత్రంలోని కల్యాణ్ రామ్ యాక్టింగ్ అతని కెరీర్లోనే ది బెస్ట్. క్రూరమైన రాక్షస చక్రవర్తి బింబిసారుడిగా పూర్తి నెగెటివ్ పాత్రలో కల్యాణ్ రామ్ అదరగొట్టాడు. అహంతో విర్రవీగే రాజుగా, ఎదురు తిరిగిన, సలహా ఇచ్చిన ప్రతి ఒక్కరినీ నిర్దాక్షణ్యంగా చంపే కర్కోటకపు రాజుగా కల్యాణ్ రామ్ చూపించిన అభినయం అబ్బురపరుస్తుంది. అలాగే సెకండాఫ్లో వచ్చే ఫైటింగ్ సీన్లలో స్టైలిష్గా, ఒక రాజులోని హుందాతనాన్ని నటనతో చాలా చక్కగా చూపించాడు. తర్వాత మనిషిగా మారిన చక్రవర్తిగా, ఎమోషనల్ సీన్లలో సైతం ఆకట్టుకున్నాడు. బింబిసారుడి తమ్ముడు దేవ దత్త పాత్రలో కూడా చక్కగా ఒదిగిపోయాడు. సినిమా మొత్తం తాను ఒక్కడై నడిపించినట్లుగా ఉంటుంది. యువరాణి ఐరాగా కేథరీన్ థ్రేసా, ఎస్సై వైజయంతిగా సంయుక్త మీనన్ నటన పాత్రకు తగినట్లుగా పర్వాలేదు. కానీ వారి రోల్స్కు అంతా ప్రాముఖ్యత లేదు. శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర కామెడీతో అలరించారు. వివాన్ భటేనా, ప్రకాశ్ రాజు, రాజీవ్ కనకాల, అయ్యప్ప పి శర్మ తదితరులు పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్గా నిలిచింది. అలాగే కథకు అనుగుణంగా వచ్చిన ఒక్కో పాట కూడా అలరిస్తుంది. ఈ ఒక్కో సాంగ్ను చిరంతన్ భట్, వరి కుప్పల యాదగిరి, ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఒక రాక్షస రాజుగా నటనతో మెస్మరైజ్ చేసిన కల్యాణ్ రామ్ 'బింబిసార' సినిమా కచ్చితంగా చూడాల్సిందే. త్రిగర్తల సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపతిగా పాలిస్తుంటాడు బింబిసారుడు (కల్యాణ్ రామ్). అహం, తనను ఎవరు ఎదిరించలేరనే పొగరుతో, పాలించే ప్రజలను, చిన్న పిల్లలను సైతం చూడకుండా అతి కిరాతకంగా చంపే కర్కోటకుడిగా రాజ్యాన్ని ఏలుతుంటాడు. ఈ క్రమంలోనే ఒక మాయ దర్పణం ద్వారా భూలోకానికి వస్తాడు. భూలోకంలో అతనికి వారసులు ఉన్నారని, అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిసిన బింబిసారుడు ఏం చేశాడు? అతి క్రూరుడైన రాజు రాజు బింబిసారుడు.. తన ప్రజల కోసం ప్రాణాలిచ్చే నిజమైన చక్రవర్తిగా, ఒక మానవత్వం గల మనిషిగా ఎలా మారాడు? టైమ్ ట్రావెల్ చేసేందుకు వీలుగా ఉన్న మాయ దర్పణం ఎలా వచ్చింది? బింబిసారుడు దాచిని నిధి తలపులు తెరవడానికి ప్రయత్నిస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రి (వివాన్ భటేనా) ఎవరు? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే 'బింబిసార' సినిమాను కచ్చితంగా చూడాల్సిందే. అంతేకాకుండా తనకు ఎదురు వస్తే, తన మాటను ధిక్కరిస్తే చిన్న పిల్లలను కూడా అంతమొందించే రాక్షస రాజుగా బింబిసార పాత్రలో కల్యాణ్ రామ్ను చూపించారు. అహంతో మదమెక్కి అరాచకాలు, ఆకృత్యాలు చేసే చక్రవర్తిగా బింబిసారుడిని చూపించడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. తర్వాత ఒక నిజమైన రాజుగా, మంచి మనిషిగా బింబిసారుడు మారే క్రమాన్ని కూడా అంతే బాగా తెరకెక్కించారని చెప్పవచ్చు. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు. నిజానికి ఇతను హర్యాంక రాజవంశానికి చెందినవాడు. అయితే ఈ బింబిసారుడు అనే పాత్రను తీసుకుని పూర్తి కల్పిత కథతో 'బింబిసార'ను తెరకెక్కించారు డైరెక్టర్ వశిష్ఠ. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే ఒక్క క్యాప్షన్తో సినిమా కథను చెప్పేశారు. చరిత్రలో బింబిసారుడు ఎలా ఉన్న ఈ సినిమాలో మాత్రం అత్యంత క్రూరుడిగా, మద గజ మహారాజుగా చిత్రీకరించారు. రాజ్యాన్ని తాను ఒక్కడే పాలించాలనే కోరికతో సొంత తమ్మున్ని సైతం చంపించే అన్నగా బింబిసారుడి పాత్రను ఆవిష్కరించారు. 'అతనొక్కడే' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్ 'పటాస్', '118' వంటి చిత్రాలతో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు 'బింబిసార'గా వచ్చాడు కల్యాణ్ రామ్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం 'బింబిసార'. టైమ్ ట్రావెల్ మూవీగా వచ్చిన ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 5) విడుదలైంది. మరి ఈ సినిమాతో కల్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడా? లేదా? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే.

Post cover
Image courtesy of "Zee News తెలుగు"

Bimbisara Review: కళ్యాణ్ రామ్ 'బింబిసార' సినిమా ఎలా ఉందంటే? (Zee News తెలుగు)

Bimbisara Move Review and Rating In Telugu: పటాస్ సినిమా తరువాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ ...

డైలాగ్స్ : వాసుదేవ్ మునెప్పగారి స్టంట్స్ : వెంకట్ & రామ్ క్రిషన్ పాటలు : చిరంతన్ భట్ ఆర్ట్ : కిరణ్ కుమార్ మన్నె ఎడిటర్ : తమ్మి రాజు విఎఫ్ఎక్స్ నిర్మాత : అనిల్ పాదూరి సంగీత దర్శకుడు : ఎంఎం కీరవాణి రచన & దర్శకత్వం : వశిష్ట డిఓపి : చోటా కె నాయుడు నిర్మాణం : హరి కృష్ణ.కె నటీనటుల : నందమూరి కళ్యాణ్ రామ్,కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి.

Explore the last week