Karthikeya 2 Movie Review: చిత్రం: కార్తికేయ 2. నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, ...
ముందు చెప్పుకున్నట్లు సినిమా కథ ద్వారకా హిస్టరీ తో మొదలవుతుంది. దాని చుట్టూనే సినిమా కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ మరియు లొకేషన్ లు చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తాయి. ఫస్ట్ హాఫ్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో మరియు నరేషన్ తో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో కథ మధుర లో మొదలవుతుంది. దేవుడు మరియు మానవత్వం గురించిన డైలాగులు చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటాయి. ఇక అదిరిపోయే నేపథ్య సంగీతం సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలలో రష్ చేసినట్లుగా అనిపిస్తుంది. అంతేకాకుండా కొన్ని కొన్ని సన్నివేశాలలో లాజిక్ కూడా మిస్ అయినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ కథ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఇక సినిమా క్లైమాక్స్ కూడా చాలా కొత్తగా ఉంది. ఓవరాల్ గా "కార్తికేయ 2" థ్రిల్లింగ్ కథతో బాగానే ఆకట్టుకుంది. డైరెక్టర్ చందు మొండేటి సినిమా కథని చాలా బాగా నెరేట్ చేశారు. రొటీన్ కథలకి భిన్నంగా ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన కథను ఎంపిక చేసుకున్న డైరెక్టర్ చందు మొండేటి దానిని వెండితెరపై ప్రజెంట్ చేసే విధానంలో కూడా చాలా బాగా మెప్పించారు. ఇక స్క్రీన్ ప్లే విషయంలో కూడా చందు మొండేటి మంచి మార్కులు వేయించుకున్నారని చెప్పుకోవాలి. ఇక "కార్తికేయ" సినిమాతో పోలిస్తే "కార్తికేయ 2" సినిమా టెక్నికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవాలి. ఈ సినిమాలోని అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కాలభైరవ సంగీతం చాలా బాగుంది. మధ్యలో వచ్చే మంత్రాలు, శ్లోకాలు కూడా చాలా బాగున్నాయి. కార్తికేయ సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఇక నిర్మాణ విలువలు కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. "కార్తికేయ 2" ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే మైథాలజికల్ మరియు అడ్వెంచరస్ రైడ్. క్యారెక్టర్లకి కాకుండా కథకి ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది. చాలావరకు కథ హీరో చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నిఖిల్ తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. టిపికల్ హీరో పాత్ర కాకుండా నిఖిల్ కి ఈ సినిమాలో నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికింది. ఇక నిఖిల్ తన పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు అని చెప్పవచ్చు. సినిమాలో కార్తికేయ పాత్రని పక్కన పెడితే మిగతా పాత్రలకి అంత ప్రాధాన్యత మరియు స్క్రీన్ టైం లేవు. అయినప్పటికీ వారు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. అనుపమ పరమేశ్వరన్ కూడా తన నటనతో బాగానే మెప్పించింది. అనుపమ్ ఖేర్ నటన సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. శ్రీనివాస రెడ్డికి కూడా ఈ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికింది. హర్ష, ఆదిత్య మీనన్, ప్రవీణ్, సత్య వంటి నటులు కూడా తమ పాత్రలలో బాగానే నటించారు. ఎప్పుడూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులు ముందుకి వచ్చే నిఖిల్ ఈసారి కూడా అలాంటి సినిమాతోనే మన ముందుకి వచ్చారు. "కార్తికేయ 2" ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ కథ. ఇక సినిమా మొదలవటమే ద్వారకా హిస్టరీ తో మొదలవుతుంది. సినిమా కథ మొత్తం శ్రీకృష్ణుడి కి చెందిన ఒక నగ చుట్టూ తిరుగుతూ ఉంటుంది? అది ఇప్పుడు ఎక్కడుంది? దానిని ఎవరు చేజిక్కించుకోవాలనుకుంటున్నారు? డాక్టర్ కార్తికేయ (నిఖిల్ సిద్ధార్థ్) దీంట్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.. ఎప్పుడో కరోనాకి ముందు 2019లో "అర్జున్ సురవరం" సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చిన యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చాలా కాలం తరువాత ఎట్టకేలకు "కార్తికేయ 2" సినిమాతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి వచ్చారు. 2014లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన మిస్టరీ థ్రిల్లర్ "కార్తికేయ" సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. "కార్తికేయ" కథతో ఏమాత్రం సంబంధం లేకుండా కొత్త కథతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు చిత్ర డైరెక్టర్ చందు మొండేటి. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఇవాళ అనగా ఆగస్టు 13, 2022 న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూసేద్దామా..
Karthikeya 2 Review చిత్రం: కార్తికేయ-2; నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ...
- General News - Movies News - General News - Movies News - India News - Politics News Telugu News - సినిమాటిక్గా అనిపించే కొన్ని భాగాలు - ఆరంభంలో కొన్ని సన్నివేశాలు
హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందంటే ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉంటాయి.
- మరిన్ని - వీడియోలు - చింతన - స్పోర్ట్స్ - సినిమా - వార్తలు
నిఖిల్,అనుపమ పమరమేశ్వరన్,ఆదిత్య మీనన్,అనుపమ్ ఖేర్,శ్రీనివాస్ రెడ్డి.
టాలీవుడ్ ఫోటో గ్యాలరీ బాలీవుడ్ ఫోటో గ్యాలరీ ఫోటో గ్యాలరీ
Karthikeya 2 Movie Review in Telugu : నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 ...
Apple Link - https://apple.co/3loQYe Android Link https://bit.ly/3P3R74U - దర్శకత్వం - చందూ మొండేటి
'ఐదు సహస్త్రాల ముందే పలికిన ప్రమాదం... ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం' అంటూ నిఖిల్ ...
మొదటి సీన్ నుంచి చివరి దాకా ఓ విధమైన క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. అయితే విలన్, హీరో మధ్య పెద్దగా ఏమి జరిగినట్లు అనిపించదు. హీరో క్యారక్టర్ కు ఎదురేలేనట్లు ముందుకు వెళ్తూంటుంది. విలన్ పాత్రకు సరైన స్టాండ్ కనపడదు. దాంతో ప్యాసివ్ గా తయారైంది. ఇలాంటప్పుడు ఈ కథల నుంచి రావాల్సిన మాగ్జిమం వావ్ ఎలిమెంట్స్ మిస్ అవుతాయి. అదే చాలా చోట్ల జరిగింది. గొప్ప కథ కాదు కానీ నేపధ్యం కొత్తగా ఉండటం. స్క్రీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా ఉండటం కలిసొచ్చింది. డ్రామా కూడా బాగా పండింది. ఫస్టాఫ్ లో సినిమా ద్వారక చుట్టూ తిరగటం, కృష్ణుడు భక్తులైన అభిరా తెగ వారు చేసే ఎటాక్ లతో నడిచిపోయింది. ఇంట్రవెల్ కూడా బాగా సెట్ అయ్యింది. సెకండాఫ్ లో కాస్త లాగినట్లు అనిపించినా, క్లైమాక్స్ కు వచ్చేసరికి సర్దుకున్నారు. ముఖ్యంగా అనుపమ ఖేర్ పాత్ర సినిమాని లేపి నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. అలాగే రొటీన్ లవ్ ట్రాక్ లు వంటివి సినిమాలో పెట్టకపోవటం కూడా పెద్ద రిలీఫ్. కథకు కీలకమైన కంకణం గురించిన పూర్వ కథను మరింత ఇంట్రస్టింగ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. అయితే కంకణానికి సంబంధించిన క్లూస్ ఒక్కోటి తెలుసుకుంటూ, చివరగా దాన్ని సాధించే క్రమం బాగుంది. అయితే చిత్రంగా కార్తికేయను ...మరణించిన రావు మనవరాలు ముగ్ధ (అనుపమా పరమేశ్వరన్) పోలీస్ స్టేషన్ నుంచి బయిటకు తీసుకు వస్తుంది. అప్పుడు అతనికి ఓ విషయం చెప్తుంది. అక్కడ నుంచి నిఖిల్ కు ఓ లక్ష్యం ఏర్పాటు చేసుకుంటాడు. అది శ్రీకృష్ణుడు కంకణం సాధించాలని. ఈ క్రమంలో అనేక అడ్డంకులు. మరో ప్రక్క శాంతను (ఆదిత్యా మీనన్), ఇంకా అభీరా తెగ వాళ్లు కార్తికేయను ఆ మిషన్ నుంచి తప్పించాలని చూస్తారు. ఇబ్బందులు పెడుతూంటారు. వాటిని అన్నిటిని తప్పించుకుంటూ కార్తికేయ ఆ కంకణం సాధిస్తాడా....ఆ కంకణం వెనక ఉన్న మిస్టరీ ఏమిటి...కార్తికేయను అడ్డు తొలిగించుకోవాలని చూస్తున్న అభీరా తెగ వాళ్లు ఎవరు..వాళ్లకేం కావాలి... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాహిత్యంలో గత కొంతకాలంగా హిస్టరీ, పురాణాల పాత్రలు బేస్ చేసుకుని కథలు, నవలలు వస్తున్నాయి. ఆ పాత్రలను మూల కథగా తీసుకుని ఇప్పటికాలానికి తీసుకొచ్చి థ్రిల్లర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ లో డావిన్సీ కోడ్ వంటివి ఈ తరహా నవలలే. అవి అన్ని చోట్లా బాగా క్లిక్ అవుతున్నాయి. మన దేశంలోనూ అశ్విన్ సంఘీ వంటి రచయితలు అలాంటి పాత్రలను,నవలలు సృష్టిస్తున్నారు. అలాంటి వాటిల్లో The Krishna Key ఒకటి. కృష్ణుడు అక్షయపాత్ర చుట్టూ తిరిగే కథ అది. అలాంటిదే ఈ సినిమా కూడాను. అయితే ఆ కథ వేరు..ఇది వేరు. ఈ సినిమా.. కృష్ణుడి కంకణం చుట్టూ ఈ కథ జరుగుతుంది. ఈ కథలో సస్పెన్స్ ఎలిమెంట్స్ కలుపుతూ, థ్రిల్లర్ నేరేషన్ లో Indiana Jones and the Raiders of the Lost Ark (1981) ని గుర్తు చేస్తూ ఈ సినిమా ముందుకు వెళ్తుంది. ఈ సినిమా హైలెట్స్ లో మొదట చెప్పుకోవల్సింది కాలభైరవ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. చాలా సీన్స్ కు ఇది చూపు తిప్పుకోనివ్వకుండా కాపు కాచేసింది. ఆ తర్వాత కెమెరా వర్క్ సైతం సినిమాని నెక్ట్స్ లెలివ్ కు తీసుకెల్లింది. ఇక డైరక్టర్ విషయానికి వస్తే.. పైన చెప్పుకున్నట్లు రొటీన్ కు వెళ్లకుండా కథను థ్రిల్లింగ్ నేరేషన్ లో చెప్పటం కలిసొచ్చింది. స్క్రిప్టులోనే చాలా భాగం సక్సెస్ అయ్యాడు. మేకింగ్ పరంగా ఈ దర్శకుడు మొదటి సినిమా నుంచి మంచి మార్కులు వేయించుకుంటూనే ఉన్నాడు. ఇక ఇలాంటి సినిమాలకు కావాల్సిన ఆర్ట్ వర్కు ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఎడిటింగ్ వర్క్ నీట్ గా ఉంది. డైలాగులు యావరేజ్ గా ఉన్నాయి. అనుపమ ఖేర్ పాత్రకు మాత్రం బాగా రాసారు. VFX వర్క్ కూడా బాగా కుదిరింది. చీప్ థ్రిల్స్ లేవు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ...బాగా రిచ్ గా ఉన్నాయి. ఇది శ్రీకృష్ణుడు కంకణం చుట్టూ తిరిగే కథ. డాక్టర్ కార్తికేయ (నిఖిల్) కు కొత్త విషయాలంటే ఆసక్తి. ప్రతీ విషయంలోనూ సైన్స్ లాజిక్ వెతుకుతూంటాడు. మూఢ నమ్మకాలని ఖండిస్తూంటాడు. అయితే ఓ సారి అతనికి ప్రమాదం ఎదురైతే...దాన్నుంచి బయిటపడితే శ్రీకృష్ణుడు నగరమైన ద్వారక కు తీసుకు వస్తానని తల్లి (తులసి) మొక్కుకుంటుంది.ఆ మొక్కు తీర్చటానికి తన కొడుకుని ఒప్పించి ద్వారక తీసుకు వెళ్తుంది. అదే సమయంలో అక్కడ ఓ గొప్ప ఆర్కియాలజిస్ట్ రావు చనిపోతాడు. అతన్ని కార్తికేయే హత్య చేసాడని పోలీస్ లు వెంబడించి అరెస్ట్ చేస్తారు. నిఖిల్ ఈ పాత్రను బాగా ఓన్ చేసుకుని ఒదిగిపోయారు. దాదాపు అంతా అతనే మోసాడు. అనుపమా పరమేశ్వరన్ ...కథకు ఉపయోగ పాత్రే.ఎంతవరకూ చేయాలో అంతవరకూ చేసింది. శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష ఫన్ తో రిలీఫ్ ఇచ్చారు. అనుపమ్ ఖేర్, ఆదిత్య మేనన్ వంటివారు తమ పాత్రని ప్రభావవంతంగా పోషించారు. అద్భుత వైద్య రహస్యాలను పొందుపరిచి ఒక సీక్రెట్ ప్లేస్ లో భద్రపరిచిన శ్రీకృష్ణుడి కంకణం చేజిక్కించుకోవాలని కొందరు దుర్మాగులు ప్రయత్నిస్తుంటే.. తన ప్రమేయం లేకుండా హీరో ఆ ట్రాక్ లోకి వచ్చి ఆ కంకణాన్ని సాధించి లోక కళ్యాణానికి ఉపయోగించడం.. ఈ క్రమంలో అతడికి ఎదురైన అనుభవాల నేపథ్యంలో కథ నడుస్తుంది. 'ఐదు సహస్త్రాల ముందే పలికిన ప్రమాదం... ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం' అంటూ నిఖిల్ విభిన్నమైన ప్రోమోలుతో ,పబ్లిసిటీ క్యాంపైన్ తో ఈ రోజు మన ముందుకు వచ్చాడు. తను హీరోగా చేసిన ‘కార్తికేయ’ సీక్వెల్ అని వచ్చిన ఈ చిత్రం శ్రీకృష్ణుడు, ద్వారకా నగరం, రహస్యం అంటూ ఆసక్తి రేపింది. ఇంతకీ ఆ రహస్యం ఏమిటి...చిత్రం కథేంటి...ఈ సినిమాతో నిఖిల్ హిట్ కొట్టాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఈరోజు థియేటర్లో విడుదలైన సినిమా కార్తికేయ 2.
సినిమా ప్రారంభం నుండి క్లైమాక్స్ వరకు మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది.ఈ సినిమాల్లోని బ్యాక్గ్రౌండ్ మాత్రం ప్రేక్షకుడిని కనెక్ట్ చేసే విధంగా ఉన్నాయి.అంతేకాకుండా నిఖిల్ నటన మాత్రం బాగా పర్ఫెక్ట్ గా ఉంది.కాబట్టి ఈ సినిమాను చూడవచ్చు. డైరెక్టర్ చందు ఈ సినిమాను బోర్ కొట్టకుండా మంచి ఫీలింగ్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.ఇక కాలభైరవ అందించిన సంగీతం బాగానే ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇదివరకే ఈ సినిమా కార్తికేయగా విడుదల కాగా ఇప్పుడు సీక్వెల్ తో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిల్ నటన, సినిమా కథ, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.సంగీతం బాగా ఆకట్టుకుంది.ప్రొడక్షన్ డిజైన్. ఇందులో నిఖిల్ తన పాత్రతో మునిగిపోయాడు.మరోసారి తన పాత్రతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.అనుపమ పరమేశ్వరన్ కూడా పాత్రతో మంచి మార్క్ క్రియేట్ చేసుకుంది.శ్రీనివాస్ రెడ్డి తన కామెడీ టైమింగ్ తో తెగ నవ్వించాడు.మిగతా నటీనటునంత తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమా చాలా ఊహ జనితమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.శ్రీకృష్ణ భగవానుడు కాలి కంకణం చుట్టూ ఈ కథ అనేది నడుస్తుంది.
Rating : 3 / 5 · MAIN CAST: Nikhil Siddharth,Anupama Parameswaran,Anupam Kher · DIRECTOR: Chandoo Mondeti · MUSIC: Kaala Bhairava · PRODUCER: Abhishek Agarwal.
దర్శక నిర్మాతలు మొదటి నుండి చెబుతున్నట్టు ‘కార్తికేయ’కు ఈ చిత్ర కథకు ఎలాంటి సంబంధం లేదు. ఇది మొత్తంగా వేరే కథ. అందులో కార్తికేయ మెడికో అయితే… ఇందులో అతను డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తుంటాడు. అందువల్ల చాలా కొత్త పాత్రలు మనకు కనిపిస్తాయి. శ్రీకృష్ణుడి కాలి కడియంకు ఉన్న శక్తి ఎలాంటిది, దానిని ఈ తరం ఎలా ఉపయోగించుకుంది అనే దానికంటే కూడా ఆ కడియాన్ని ఓ సామాన్యమైన డాక్టర్ ఎలా పొందాడు? అనే దాని మీదనే దర్శకుడు దృష్టి పెట్టాడు. పూజా పునస్కారాలను, మంత్రాలను, హోమాలను విశ్వసించని ఓ డాక్టర్… కృష్ణుడి గొప్పతనాన్ని గురించి ఓ ప్రొఫెసర్ ద్వారా తెలుసుకుని సమాజ హితం కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టడానికి ప్రయత్నించాడన్నదే ఈ చిత్రం. కథ హైదరాబాద్ నుండి ద్వారక, మధుర మీదుగా హిమాలయాలకు సాగడమనేది ఆసక్తికరంగా ఉంది. ఒక్కే ప్రదేశంలో ఒక్కో క్లూను తీసుకుని, హీరో తన బృందంతో కలిసి హిమాలయాలకు చేరి అక్కడ కృష్ణుడి కాలి కడియం పొందడం అనేది చందమామ కథను తలపించేలా ఉంది. సినిమా ప్రారంభం నుండి దాదాపు ఒకే స్కేల్ లో సాగుతుంది. ఎక్కడా అప్ అండ్ డౌన్స్ ఉండవు. అలాంటి సమయంలో అనుపమ్ ఖేర్ పాత్ర ప్రవేశించిన తర్వాత ఒక్కసారిగా మూవీ గ్రాఫ్ పెరిగిపోయింది. అక్కడ నుండి క్లయిమాక్స్ వరకూ వేగంగా సాగిపోయింది. దాంతో అప్పటి వరకూ సో… సో… గా ఉందని భావించిన ప్రేక్షకులు సైతం అబ్బురానికి గురవుతారు. విశేషం ఏమంటే… ఈ కథను ఇంతటితో ఆపేయకుండా దీనికి కొనసాగింపు కూడా ఉంటుందన్నట్టు ముగించారు. నటీనటుల విషయానికి వస్తే నిఖిల్ వైవిధ్యమైన పాత్రను సమర్థవంతంగా చేశాడు. దైవశక్తి మీద పెద్దంత విశ్వాసం లేని ఓ వైద్యుడు దైవకార్యంలో నిమగ్నం కావడం అనేది ఆసక్తిని కలిగించేదే. ఆ పాత్రను ఆకళింపు చేసుకుని చక్కగా నటించాడు. అనుపమా పరమేశ్వరన్ పాత్ర ఎంట్రీ లేట్ గా జరిగింది కానీ అక్కడ నుండి అది చివరి వరకూ కొనసాగుతుంది. హీరో మేనమావగా శ్రీనివాసరెడ్డి, ట్రక్ డ్రైవర్ గా వైవా హర్ష చక్కని వినోదాన్ని అందించే ప్రయత్నంచేశారు. వారూ కథతో పాటే ట్రావెల్ అవుతారు. అలానే ఆదిత్య మీనన్, వెంకట్ ప్రతినాయకులుగా మెప్పించారు. హీరో తల్లిగా తులసి నటన బాగుంది. సినిమా ప్రారంభంలో కో-డాక్టర్స్ గా సత్య, ప్రవీణ్ కాస్తంత కామెడీ పండించారు. అనుపమ్ ఖేర్ పాత్ర ఇంకా రాలేదేమిటీ అనుకుంటూ ఉండగా ఆయన ఎంట్రీ జరుగుతుంది. అనుపమ్ ఖేర్ వర్త్ ఫుల్ క్యారెక్టర్ చేశారు. మూవీని ఒక్కసారిగా పైకి లేపారు. సాంకేతిక నిపుణుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీతో పాటు ఎడిటింగ్ చేసిన కార్తిక్ ఘట్టమనేని గురించి. అతని విజువల్సే కాదు… ఎడిటింగ్ సైతం షార్ప్ గా ఉంది. ఇక కాలభైరవ తన నేపథ్య సంగీతంతో మూవీలోని ప్రతి సన్నివేశానికీ ప్రాణం పోశారు. ఓ సాధారణమైన సన్నివేశం సైతం కాలభైరవ, కార్తిక్ ఘట్టమనేని కారణంగా ఆసక్తికరంగా తెరపై కనిపించాయి. నిజానికి ఈ కథను మరింత ఆసక్తికరంగా, మరింత గ్రిప్పింగ్ గా తీయొచ్చు. డైరెక్టర్ చందూ మొండేటి తన ప్రతిభను పూర్తి స్థాయిలో ఉపయోగించలేదేమో అనిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మరో హైలైట్ మణిబాబు కరణం సంభాషణలు. ఎంతో ఉత్తేజభరితంగానూ, అర్థవంతంగానూ ఉన్నాయి. సీజీ వర్క్ సైతం చాలా బాగుంది. నిర్మాణ విలువలకూ కొదవలేదు. రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలను చూసి బోర్ ఫీలవుతున్న ప్రేక్షకులకు ‘కార్తికేయ -2’ ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. శ్రీకృష్ణ నిర్యాణంతో ఈ సినిమా కథ మొదలవుతుంది. నిషాదుని బాణంతో తనువు చాలించే ముందు శ్రీకృష్ణుడు తన కాలు కడియాన్ని ఉద్ధవునికి ఇచ్చి, రాబోయే కలియుగంలో చాలా ఘోరాలు జరుగుతాయని, వాటిని నివారించే శక్తి ఇందులో నిబిడీకృతమైందని చెబుతాడు. ఇక ప్రస్తుతానికి వస్తే… శ్రీకృష్ణుడి కడియంలోని గొప్పతనం తెలుసుకున్న ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ రంగనాథ రావ్ గ్రీస్ లైబ్రరీలోని ఓ గ్రంధం నుండి దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తాడు. ప్రొఫెసర్ రావ్ తనతో చేతులు కలపకపోవడంతో సైంటిస్ట్ శాంతను (ఆదిత్య మీనన్) ఆ కడియం కోసం ప్రొఫెసర్ రావ్ ను హతమార్చేందుకు ప్రయత్నిస్తాడు. ఇదే సమయంలో నాస్తికుడైన, డాక్టర్ కార్తికేయ (నిఖిల్) తన తల్లి ఒత్తిడి మేరకు ఓ మొక్కు తీర్చుకోవడానికి ద్వారక నగరానికి వస్తాడు. శాంతను మనుషుల చేతిలో హతమవ్వడానికి ముందు ప్రొఫెసర్ రావ్ అనుకోకుండా కార్తికేయను చివరిసారి కలుస్తాడు. దాంతో శాంతను మనుషులతో పాటు, శ్రీకృష్ణ భక్తులు అభీరులకు సైతం కార్తికేయ టార్గెట్ అవుతాడు. ప్రొఫెసర్ రావ్ మనవరాలు ముగ్థ (అనుపమా పరమేశ్వరన్) సాయంతో వారందరిని తప్పించుకుని కార్తికేయ అంచలంచెలుగా హిమాలయాలకు చేరి అక్కడి చంద్రశిల శిఖరంలోని శ్రీకృష్ణుడి కడియాన్ని ఎలా పొందాడన్నదే మిగతా కథ. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, డైరెక్టర్ చందూ మొండేటి కాంబినేషన్ లో ‘కార్తికేయ’ చిత్రం వచ్చి చూస్తుండగానే ఎనిమిదేళ్ళు గడిచిపోయాయి. వీరిద్దరి కాంబోలో మళ్ళీ ఇంతకాలానికి ‘కార్తికేయ -2’ రూపుదిద్దుకుంది. నిజానికి ఇది మొదటి సినిమాకు సీక్వెల్ కాదు. కార్తికేయ పాత్రను మాత్రమే ఇందులో క్యారీ చేశారు. ఈ లేటెస్ట్ మూవీని అభిషేక్ అగర్వాల్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రకరకాల కారణాలతో అనేకసార్లు వాయిదా పడిన ‘కార్తికేయ -2’ ఎట్టకేలకు శనివారం జనాల ముందుకు వచ్చింది.
Karthikeya 2 Movie Review and Rating Nikhil another Thrilling Adventure Drama,Karthikeya 2 Movie Review : కార్తికేయ 2 మూవీ రివ్యూ.
: : : : : : : : : :
టైటిల్: కార్తికేయ 2 రేటింగ్: 2.5/5 తారాగణం: నిఖిల్, అనుపమ, అనుపమ్ ఖేర్, తులసి, శ్రీనివాస ...
ఎడిటింగ్: కార్తిక్ ఘట్టమనేని కెమెరా: కార్తిక్ ఘట్టమనేని
Karthikeya-2 north indians movie lovers requesting to increase nikhil karthikeya movie shows in Hindi region, Karthikeya-2: కార్తికేయ-2 ...
— Nikhil Siddhartha (@actor_Nikhil) August 13, 2022 — Movies For You ???????? (@Movies4u_Officl) August 14, 2022 Telugu Show is filling fast in Bombay Cineplex of Kharagpur.... I will Wait for Hindi version.. — Ms Teja (@MaruthiSaiTeja2) August 14, 2022 — Thakur Rattan (@RattanT01429991) August 14, 2022 — Riya Ishqaan KGF Dewaani (@parakshitaKGF) August 13, 2022 — Team Saffron Bharat ???????? (@Saffron_coming) August 14, 2022
మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా భారీ కలెక్షన్ల దిశగా ...
Channel No. 176 Channel No. 1667 Channel No. 722 Channel No. 905 Channel No. 1459
Nikhil Siddharth Karthikeya 2 Day 1 Box Office Collection Worldwide: నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి ...
► నెల్లూరు - రూ.17 లక్షలు ► కృష్ణా - రూ.27 లక్షలు ► వెస్ట్ - రూ.20 లక్షలు ► ఈస్ట్ - రూ.33 లక్షలు ► గుంటూరు- రూ.44 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.45లక్షలు ► సీడెడ్ -రూ.40 లక్షలు ► మెత్తం రూ. రూ.3.50 కోట్లు(షేర్) ► నైజాం - రూ.1.24 కోట్లు
Karthikeya-2 Movie | గతవారం 'బింబిసార', 'సీతారామం'తో కళకళలాడిన బాక్సాఫీస్ ఈ వారం ...
- లైఫ్స్టైల్ - ఎన్ఆర్ఐ - ప్రత్యేకం
Nikhil Siddharth Now Did Karthikeya 2 Movie Under Chandoo Mondeti Direction. This Movie Collect 5.05 Cr in First Day. నిఖిల్ సిద్దార్థ్ ...
నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 3.50 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 25 లక్షలు, ఓవర్సీస్లో రూ. 1.30 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.05 కోట్లు షేర్తో పాటు రూ. 8.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ఎన్నో సార్లు వాయిదా పడి శనివారమే విడుదలైన 'కార్తికేయ 2' మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ భారీ స్పందన వచ్చింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ఈ సినిమా రూ. 3.50 కోట్లు వసూలు చేసింది. తద్వారా నిఖిల్ సిద్దార్థ్ కెరీర్లోనే ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఇది రికార్డు సాధించింది. దీనికంటే ముందు కిర్రాక్ పార్టీ రూ. 1.65 కోట్లతో టాప్ ప్లేస్లో ఉండేది. టాలెంటెడ్ స్టార్ నిఖిల్ హీరోగా నటించిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 5.05 కోట్లు వచ్చాయి. అంటే మరో 8.25 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్గా నిలుస్తుంది. 'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రెస్పాన్స్ బాగా వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.24 కోట్లు, సీడెడ్లో రూ. 40 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 45 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 44 లక్షలు, కృష్ణాలో రూ. 27 లక్షలు, నెల్లూరులో రూ. 17 లక్షలతో.. రూ. 3.50 కోట్లు షేర్, రూ. 5.30 కోట్లు గ్రాస్ వసూలు అయింది. నిఖిల్ మార్కెట్కు తోడు 'కార్తికేయ 2' మూవీపై నెలకొన్న అంచనాల ప్రకారం.. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్ జరుపుకుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన థ్రిల్లర్ మూవీ 'కార్తికేయ 2' శనివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయేలా పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే పాజిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో ఈ సినిమాకు అనుకున్న విధంగా ఓపెనింగ్ డేన కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.
చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్ట్ చేసిన కార్తికేయ 2 (Karthikeya 2) ఆగస్టు 13న థియేటర్లలో ...
- ప్రత్యేకం - బిజినెస్ - సినిమా